ఆంధ్రప్రదేశ్

andhra pradesh

marreddy_srinivasa_reddy

ETV Bharat / videos

Marreddy Srinivasa Reddy Comments About Krishna Waters: కృష్ణా జలాలపై హక్కులను కాపాడటంలో జగన్‌ విఫలం : మర్రెడ్డి - Agriculture Steering Committee meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2023, 1:28 PM IST

Marreddy Srinivasa Reddy Comments About Krishna Waters:కృష్ణా జలాల్లో హక్కులు కోల్పోతే రాష్ట్రం ఎడారిగా మారిపోతుందని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జలాల పునపరిశీలనపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్​కు అధికారం కట్టబెట్టడంపై టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో వ్యవసాయ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. వైసీపీకు 31 మంది ఎంపీలు ఉన్నా.. లాలూచీ, కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని ధ్వజమెత్తారు. పోలవరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు ఎండగట్టడం వల్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 

రాష్ట్ర నీటి హక్కులను కాపాడటంలో జగన్‌ విఫలమయ్యాడని మర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులు కాపాడటం కోసం తెలుగుదేశం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి రంగ నిపుణులు, మేధావులు, రాజకీయ పార్టీలు, రైతు సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడంతో పాటు ఆయా జిల్లాల్లో రైతులు, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ బహిరంగ సభలు ఏర్పాడు చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details