yuva సైకిల్ తొక్కండి.. ఫిట్నెస్ పొందండి! సైకిల్‌పై దేశాన్ని చుట్టేస్తున్న ప్రకాశం జిల్లా యువకుడు - cycling news
cycling: స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదికా అమృత్ మహోత్సవం నిర్వహించింది. ఈ నేపథ్యంలో తనవంతు సహకారం అందించేందుకు ప్రకాశం జిల్లాకి చెందిన వెంకట్ దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టారు. ఉద్యోగరీత్యా గుజరాత్లో ఉండే వెంకట్ అక్కడ నుంచే సైకిల్ యాత్ర ప్రారంభించారు. వెంకట్‌కు ఎప్పటి నుంచో దేశమంతా తిరగాలనే కోరికతో పాటుగా... నేటి సమాజంలో బలహీనంగా తయారవుతున్న యువతకు ఫిట్నెస్ పై అవగాహన కల్పిస్తూ సైకిల్ యాత్ర చేపట్టాలనే కోరిక ఉండేది. అందు కోసమే... ఈ ఏడాది మే 12 వ తేదీన గుజరాత్, గాంధీనగర్ లో ప్రారంభమైన సైకిల్ యాత్ర రాజస్థాన్, పంజాబ్, జమ్మూకాశ్మీర్, లద్ధాక్ హిమాచల్ ప్రదేశ్, కలకత్తా, పశ్చిమబంగాల్, ఒరిస్సా రాష్ట్రాల మీదుగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం చేరుకున్నారు. 70 రోజుల పాటు సాగే ఈ సైకిల్ యాత్ర కోసం గాంధీనగర్లోని ఫోర్స్ వన్ అకాడమీలో 6 నెలల ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. ఇన్ఫోసిస్, విప్రో లాంటి సాఫ్ట్ వేర్ కంపెనీలోని లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని సాహస యాత్ర ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటైన నేపాల్లో ఉన్న 8,163 మీటర్లు మనసులు .. మంచు పర్వతాన్ని అధిరోహించి శారీరక దృఢత్వం సంకల్పంతో ఏదైనా చేయొచ్చని నిరూపించిన ఈ తెలుగు సహాస సైకిల్ యాత్రికునితో ఈటీవీ భారత్ ముఖాముఖి