సింహాద్రి అప్పన సన్నిధిలో మకర వేట ఉత్సవాలు - వరహాలక్ష్మీ దేవస్థానం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 17, 2024, 5:47 PM IST
Makara Veta Celebrations: కనుమ పండగను పురష్కరించుకొని విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిధిలో మకర వేట ఉత్సవాలు వైభవంగా జరిగాయి. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు చేశారు. అనంతరం కొండ దిగువన పూలతోటలో ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీ వరహాలక్ష్మీ దేవస్థానంలో నిర్వహిచే ఈ ఉత్సవాల్లో భాగంగా మకర వేట కనుమ పండుగ రోజున నిర్వహిస్తారు. స్వామివారిని కొండ మీద నుంచి మెట్ల మార్గం ద్వారా తొలి పవంచా వద్ద నుంచి పైడితల్లి అమ్మవారి గుడి వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి స్వామి వారి పూల తోటకు, వేదమంత్రాల నడుమ నాదస్వర బృందాలతో వైభవంగా తీసుకువచ్చారు. పూల తోటలో అధిష్టింపజేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరాధన, విశేషా ఆరాధన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు. స్వామి వారు దయార్థ హృదయులని, ఎవరికి ఎటువంటి హాని చేయరని అని లోకానికి తెలిజేయాలనే ఉద్దేశంతో ఈ మకర వేట ఉత్సవం నిర్వహిస్తారని భక్తులు నమ్ముతారు. ఈ మకర వేట సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి దర్శనాలను నిలిపివేశారు.