Lord Krishna Iskcon Utsavalu: ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి ఉత్సవాలు.. - vijayawada latest news
Lord Krishna Iskcon Utsavalu: విజయవాడ ఇస్కాన్ జగన్నాథ మందిరం ఆధ్వర్యంలో రథోత్సవాన్ని అత్యంత కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా గుడించా మందిరాన్ని తయారు చేయించి బలభద్ర సమేత జగన్నాధ స్వామిని ఆ మందిరంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పాభిషేకంతో పాటు సుమారు 200కు పైగా రకాల ప్రసాదాలను నివేదించారు. ఈ ఉత్సవంలో కోలాట ప్రదర్శనలు అత్యంత వైభవంగా జరిగాయి. చిన్నారులకు వేషధారణ పోటీలు ఏర్పాటు చేశారు. భక్తితో పాటు సంస్కృతి సంప్రదాయాలను కాపాడేలా తగు కార్యక్రమాలను చేపట్టారు. జగన్నాథ స్వామి రథోత్సవం అనంతరం మూడు రోజుల పాటు గుడించా మందిరంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. విదేశీ ప్రతినిధులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని హరే కృష్ణ అంటూ.. సంకీర్తనలు చేశారు. ఈ సందర్భంగా 'శ్రీ జగన్నాధ లీలామృతం' అనే పుస్తకాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు ఆదివారం లాంచ్ చేశారు. ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.