Lokesh Yuvagalam: యువగళం ప్రజాగర్జన చూసి జగన్ కి నిద్రపట్టడం లేదు: లోకేశ్ - యువగలం నవీకరణలు
Lokesh Yuvagalam at Kamalapuram: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం లో కొనసాగుతోంది. చెన్నూరులో లోకేష్ బహిరంగ సభ నిర్వహించారు. కడప గడ్డపై యువగళం ప్రజాగర్జన చూసి జగన్‌కి నిద్రపట్టడం లేదని.., దీంతో కోడిగుడ్లతో దాడికి ఉసిగొల్పాడని ధ్వజమెత్తారు. వైసీపీ సైకో బ్యాచ్‌కి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే సమయం దగ్గర్లో ఉందని హెచ్చరించారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్న తరువాతే చంద్రబాబు.. 'భవిష్యత్‌కు గ్యారెంటీ' పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారన్నారు. కమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి నిల్లు.. అహంకారం, అవినీతి, భూకబ్జాలు ఫుల్లు అని మండిపడ్డారు. ఇసుక, మట్టి, గ్రావెల్ దందా, భూకబ్జాలకు కమలాపురాన్ని కేరాఫ్ అడ్రస్‌గా రవీంద్రనాథ్‌రెడ్డి మార్చేశాడని ఆరోపించారు. కమలాపురంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులు, పేదలకు ఇళ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు వేసి అభివృద్ధి చేసింది టీడీపీ అని తెలిపారు. సభ జరుగుతున్న సమయంలో నమాజ్ జరగడం విని కాసేపు లోకేష్ తన ప్రసంగాన్ని ఆపారు.