ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నారా లోకేశ్

ETV Bharat / videos

Lokesh Padayatra in Vinukonda: వినుకొండలో లోకేశ్ పాదయాత్ర.. అడుగడుగునా బ్రహ్మరథం - యువగళం పాదయాత్ర

By

Published : Aug 2, 2023, 10:26 PM IST

Updated : Aug 3, 2023, 6:20 AM IST

Lokesh Yuvagalam Padayatra in Vinukonda: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 173వ రోజుకు చేరుకుంది. యువగళం పాదయాత్రలో లోకేశ్ వెంట భారీగా యువత, పార్టీ శ్రేణులు నడిచారు. లోకేశ్​కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. వినుకొండలో భారీ గజమాలను లోకేశ్​కు వేసి టీడీపీ శ్రేణులు సత్కరించారు. ప్రజలను పలకరిస్తూ లోకేశ్ ముందుకు సాగారు. పలువురు ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటూ.. వినతిపత్రాలు ఇచ్చారు. 173వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన బహిరంగ సభలో లోకేశ్‌ ప్రసంగించారు. నేటి పాదయాత్రకు భారీగా టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. రహదారులు అన్నీ జనసందోహంగా మారాయి. ఈ రోజు వినుకొండ బసిరంగ సభలో లోకేశ్.. వైసీపీ పాలనపై, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కాదు.. కబ్జాల రాయుడు అని నారా లోకేశ్‌ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అవినీతిపై సిట్‌ ఏర్పాటు చేస్తామని లోకేశ్‌ పేర్కొన్నారు.

Last Updated : Aug 3, 2023, 6:20 AM IST

ABOUT THE AUTHOR

...view details