ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Lokesh_Lunch_Motion_Petition_in_AP_High_Court

ETV Bharat / videos

Lokesh Lunch Motion Petition in AP High Court: లోకేశ్​ ఫైబర్ గ్రిడ్ కేసు.. ముందస్తు బెయిల్​కు.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్.. - ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 3, 2023, 1:40 PM IST

Lokesh Lunch Motion Petition in AP High Court: ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటీషన్​ను స్వీకరించిన న్యాయస్థానం.. వ్యాజ్యంపై మధ్యాహ్నం విచారణ జరపనుంది. ఇప్పటికే ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ రెగ్యులర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం ఈనెల 4 వ తేదీకి వాయిదా వేసింది. ఈ రోజు అత్యవసరంగా ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్​పై విచారణ జరపాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. అమరావతి రింగ్ రోడ్ కేసులో సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులో నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్​ దాఖలు చేశారు. హెరిటేజ్​కు సంబంధించిన దస్త్రాలను తీసుకురమ్మని అనటం.. ఇతర నిబంధనలపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఈ పిటిషన్​పై మధ్యాహ్నం విచారణ జరగనుంది. ఈనెల 4వ తేదీ విచారణకు హాజరుకావాలని ఇటీవల లోకేశ్​కు సీఐడీ 41 ఏ నోటీసులు జారీ చేసింది. 

ABOUT THE AUTHOR

...view details