ఆంధ్రప్రదేశ్

andhra pradesh

pawan kalyan say sorry to Grama Volunteer

ETV Bharat / videos

kottu on pawan kalyan: పవన్ కళ్యాణ్ ఒక మహిళా ద్వేషి.. వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని కొట్టు డిమాండ్

By

Published : Jul 12, 2023, 1:41 PM IST

Kottu Satyanarayana Comments On Pawan Kalyan : పవన్ కల్యాణ్ వాలంటీర్లకు భేషరుతుగా క్షమాపణ చెప్పాలని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. పవన్​తో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. పవన్ ఉన్మాదిలాగా మాట్లాడుతున్నాడని ఉప ముఖ్యమంత్రి మండి పడ్డారు. పవన్ కళ్యాణ్ ఒక మహిళా ద్వేషి అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వివాహ వ్యవస్థపై పవన్​కి నమ్మకం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.65 లక్షల మంది వాలంటీర్లలో 70 శాతం మంది మహిళలేనని ఉపముఖ్యమంత్రి స్పష్ఠం చేశారు. 

ప్రభుత్వం ఇచ్చే అన్ని సంక్షేమ పథకాలను వాలంటీర్లు ప్రజలకు నేరుగా అందిస్తున్నారని వివరించారు. ఏపీలో అమలవుతున్న వాలంటీర్ల వ్యవస్థను ప్రపంచం అంతా మెచ్చుకుంటోందని గుర్తు చేశారు. వాలంటీర్లను పవన్ ఉగ్రవాదులతో పోల్చడం దుర్మార్గమైన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లలో చాలా మంది జనసేన వాళ్లూ ఉన్నారని, ఒకవేళ వాళ్ళు ఏమైనా సమాచారం ఇస్తున్నారా అనేది పవన్ చెప్పాలన్నారు. పవన్ మాటల వల్ల ఎవరికి ఇబ్బంది కలిగిందో వాళ్ళే పవన్​పై కేసులు పెడతారని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడ గొడవలు జరిగిన అక్కడ జనసేన వాళ్ళు హస్తం ఉంటుందని ఆరోపించారు. జన్మభూమి కమిటీలు చేసిన పనే వాలంటీర్లు చేస్తున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details