ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Kollu_Ravindra_Visited_the_TDP_Workers

ETV Bharat / videos

Kollu Ravindra Visited the TDP Workers: వైసీపీ నాయకుల చేతిలో దాడికి గురైన టీడీపీ కార్యకర్తలకు కొల్లు రవీంద్ర పరామర్శ - టీడీపీ సైకిల్ యాత్ర

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2023, 10:17 AM IST

Kollu Ravindra Visited the TDP Workers Attacked by YSRCP Leaders in Punganur : చిత్తూరు జిల్లా పుంగనూరులో వైఎస్సార్సీపీ నాయకుల చేతిలో దాడికి గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, బీసీ నేత వీరంకి గురుమూర్తి పరామర్శించారు.  గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన వారిని నేతలు సత్కరించారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు వారు చేపట్టిన సైకిల్‌ యాత్రలో  (TDP Workers Cycle Yatra Srikakulam To Kuppam) ఎదురైన అనుభవాల్ని అడిగి తెలుసుకొన్నారు. వైసీపీ నియంతృత్వాన్ని సమాధి చేసే రోజుల దగ్గర్లోనే ఉన్నాయని, అప్పటి వరకూ ఈ పోరాటం ఆపవద్దని వారికి సూచించి, వారికి ధైర్యం చెప్పారు. టీడీపీ కార్యకర్తలు ఏ కష్టం వచ్చినా పార్టీ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని వారు హామీ  ఇచ్చారు. ఇలాంటి దాడులు, దౌర్జన్యాలతో ప్రజాపోరాటాల్ని అడ్డుకోలేరని వైసీపీ నాయకుల్ని (Kollu Ravindra Warning to YCP Leaders) టీడీపీ నేతలు హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details