Nagababu Released Video On Polavaram కథాకళి-2 పేరుతో ప్రత్యేక వీడియోను విడుదల చేసిన నాగబాబు - అక్షయపాత్ర లాంటి పోలవరాన్ని గాలికి వదిలేశారు
Nagababu Released Special Video On Polavaram Project : వైఎస్సార్సీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టుని అటకెక్కించారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణదెల నాగబాబు విమర్శించారు. దీనికి సంబంధించి 'కథాకళి-2' పేరిట ఆయన ప్రత్యేక వీడియో విడుదల చేశారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి వేములపాటి అజయ కుమార్ మధ్య జరిగిన సంభాషణతో వీడియో ఆయన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగు, తాగునీటితో పాటు వేల కోట్ల ఆదాయ వనరులను అందించే అక్షయ పాత్ర వంటి పోలవరం ప్రాజెక్టుని ప్రభుత్వం గాలికి వదిలేసిందని నాగబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలవరం పనులు జరగవని, ఆగిపోయినట్టేనని, చాలా బాధగా ఉందిని అన్నారు. పోలవరం పూర్తైతే మూడు పంటలు పండుతాయని, లక్ష కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని కానీ ఇప్పుడు పూర్తైయ్యే పరిస్థితి లేదని ఆయన అన్నారు. నీతి, నిజాయితీ, రైతులు పట్ల ప్రేమ ఉన్న నాయకుడు పవన్ కల్యాణ్ నాయకత్వంలో పోలవరం కడతారని, ప్రజలు ఆనదంగా ఉంటారని వేములపాటి అజయ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.