ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Janasena_Gade_Venkateswara_Rao_on_Illegal_Mining

ETV Bharat / videos

'వైస్సార్సీపీ నేతలు అడ్డగోలుగా మట్టి తవ్వకాలు చేపట్టినా అధికారులు పట్టించుకోవడం లేదు' - అక్రమ ఇసుక తవ్వకాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2024, 7:21 PM IST

Janasena Leader Gade Venkateswara Rao on Illegal Mining: వైఎస్సార్సీపీ నేతలు అడ్డగోలుగా మట్టి తవ్వకాలు చేస్తుంటే గనుల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం లచ్చన్న గుడిపూడిలో అక్రమ మైనింగ్ జరిగిన ప్రాంతాన్ని స్థానిక జనసేన నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలోని రైతులతో మాట్లాడారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన వైఎస్సార్సీపీ నేతలను ఇష్టం వచ్చినట్లు తవ్వుకోమని అధికారులు అనుమతి ఇస్తున్నారని ఆరోపించారు. 

మైనింగ్ అధికారులు 20అడుగుల లోతు వరకు తవ్వకాలకు మాత్రమే అనుమతులు ఇస్తారని, కానీ ఈ ప్రాంతంలో తాటి చెట్టంత లోతు తవ్వకాలు చేశారని ఆరోపించారు. అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారని విమర్శించారు. అక్రమ తవ్వకాలతో పర్యావరణం నాశనమవుతోందని, ఈ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటి రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లా గనుల శాఖ అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి అక్రమ తవ్వకాలు ఆపాలని డిమాండ్ చేశారు.  

ABOUT THE AUTHOR

...view details