ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పవన్ కల్యాణ్

ETV Bharat / videos

Pawan Kalyan: తెగించకపోతే.. ఈ క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలగొట్టలేం : పవన్ కల్యాణ్

By

Published : Jul 13, 2023, 3:55 PM IST

Updated : Jul 13, 2023, 8:11 PM IST

Pawan Kalyan Comments: అద్భుతాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు.. పేదల జీవితాలను మార్చాలనే వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్.. తాడేపల్లిగూడెంలో జనసేన నాయకులు, వీర మహిళలతో సమావేశమయ్యారు. రాజకీయాల్లో రావడం తనకేమీ సరదా కాదని.. సమాజంపై ప్రేమతో... నా ప్రాణాన్ని, కుటుంబాన్ని పణంగా పెట్టి వచ్చానని పవన్ పేర్కొన్నారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికే పోరాడుతున్నానని స్పష్టం చేశారు. పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థ ఎందుకని పవన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి అనేది నిత్యకృత్యమైపోయిందన్న పవన్.. తన అభిమాని అయినా సరే.. మాన, ప్రాణాలకు భంగం కలిగిస్తే శిక్షించాల్సిందేనని అన్నారు. 

ప్రలోభాలను దాటుకుని వెళ్తున్నామని.. రాజకీయాల్లో ఎదురుదాడి అలవాటు చేసుకోవాలని పవన్ తెలిపారు. మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడే పనిలేదని చెప్పిన పవన్... తెగించకపోతే ఈ క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలగొట్టలేం అని చెప్పారు. ప్రభుత్వం వాహనమిత్ర కింద డబ్బులిచ్చి.. జరిమానా రూపంలో వసూలు చేస్తోందని, రూ.10 వేలను వారంలోపు వసూలు చేస్తారని పవన్ తెలిపారు.

శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న జనసేన నాయకుడ్ని చెంపదెబ్బ కొట్టడం ఎంతవరకు సమంజసం అని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ నిలదీశారు. తన పార్టీ నాయకులకు అండగా నిలిచేందుకు రేపు శ్రీకాళహస్తి వెళ్లనున్నట్లు తెలిపారు. వాలంటీర్‌లలో ఉన్న అక్రమార్కుల గురించి మాత్రమే తాను మాట్లాడానన్నారు. డేటా విషయంలో ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందన్నారు.

Last Updated : Jul 13, 2023, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details