ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యార్థిని ఆత్మహత్య

ETV Bharat / videos

Inter Student Suicide: కాలేజీ మారినా ఆగని వేధింపులు.. ఇంటర్​ విద్యార్థిని బలవన్మరణం - విద్యార్థిని ఆత్మహత్య

By

Published : Jul 28, 2023, 5:32 PM IST

Inter Student Suicide in Sri Satyasai District: ఆకతాయి వేధింపుల తాళలేక ఇంటర్మీయట్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడి నుంచి తప్పించుకోవడానికి కళాశాల మారినా.. అతని ఆగడాలు తగ్గకపోవడంతో మనస్తాపానికి గురై.. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. తనకల్లు మండలం గుంజేపల్లికి చెందిన దొడ్డెప్ప రెండో కుమార్తె అన్నమయ్య జిల్లా మొలకల చెరువు ప్రభుత్వ మోడల్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. తనకల్లు మండలం బిల్లూరివాండ్లపల్లికి చెందిన సలీమ్.. విద్యార్థిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె.. తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తల్లిదండ్రులు.. సలీమ్ కుటుంబ సభ్యుల దృష్టికి విషయం తీసుకువెళ్లి హెచ్చరించారు. అయినా అతని వెకిలి చేష్టలు మానకపోవడం వల్ల వారం రోజుల కిందట విద్యార్థినిని తనకల్లు ప్రభుత్వ కళాశాలలో చేర్పించారు. విద్యార్థిని వెంటబడుతున్న సలీమ్.. గుంజేపల్లికి చెందిన యువకుడితో స్నేహం చేస్తూ బాలిక వెంటపడ్డాడు. విసిగిపోయిన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను తనకల్లు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచనతో కదిరి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. తమ బిడ్డ చావుకు కారణమైన వారిని చట్టపరంగా శిక్షించాలని బాధితులు రోదిస్తున్నారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details