అక్రమంగా అరెస్టైన టీడీపీ నేతకు బెయిల్ మంజూరు- పరామర్శించిన నేతలు - YCP cases against TDP leaders
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 2:00 PM IST
Illegally Arrested TDP Sympathizer Granted Bail:ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని తెలుగు యువత ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డిని రొంపిచర్ల పోలీసులు అదుపులోకి తీసుకుని అక్రమ మద్యం కేసు నమోదు చేయగా ప్రస్తుతం బెయిల్పై బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన శ్రీనివాసరెడ్డిని టీడీపీ నేతలు ఫోన్ చేసి పరామర్శించారు. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో వైసీపీపై పోస్టులు పెట్టాడని రొంపిచర్ల పోలీసులు అదుపులోకి తీసుకుని అక్రమ మద్యం కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి బెయిల్పై విడుదలయ్యారు. బెయిల్పై బయటకు వచ్చిన గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు, జీవీ ఆంజనేయులు, పలువురు టీడీపీ నేతలు ఫోన్లో పరామర్శించారు. జైలు నుండి బయటకు వచ్చిన శ్రీనివాసరెడ్డిని శాలువా కప్పి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని టీడీపీ నేతలు గోనుగుంట్ల కోటేశ్వరరావు, కడియాల వెంకటేశ్వరరావు. భరోసా ఇచ్చారు.