ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Illegal Sand Mining in Bapatla District

ETV Bharat / videos

Illegal Sand Mining in Bapatla District : బాపట్లలో ఇసుక అక్రమ తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు.. - నల్లమోతువారిపాలెం గ్రామపంచాయతీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2023, 1:51 PM IST

 Illegal Sand Mining in Bapatla District :బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. గ్రామంలోని అసైన్డ్‌ భూమిలో భారీగా ఇసుకను తవ్వి తరలిస్తున్నా.. అధికారులు పట్టించుకోవటంలేదని స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార వైసీపీ నేతలే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని సర్పంచ్ సుబ్రహ్మణ్యం  మండిపడుతున్నారు. ఇసుక అక్రమ రవాణాతో దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారని సుబ్రహ్మణ్యం ఆరోపించారు. సుమారు 20 అడుగుల లోతులో ఇసుక తవ్వకాలు జరిగాయని తెలిపారు. దాని పక్కన ఎస్టీ కాలనీ ఉండడం భవిష్యత్తులో ప్రమాదాలు దారి తీసే  అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇసుక తవ్వకాలపై అధికారులకు తెలిపిన ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని అన్నారు. వైసీపీ నాయకులు ట్రక్కుల్లో ఇసుక తరలిస్తుంటే ఈ అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణానికి వారి సొంత భూముల్లో మట్టి తీసుకోవడానికి వీలు లేకుండా చేశారు అని సర్చంచ్ విమర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో సొంత భూమిలో ఇసుక తీసుకు వెళితే వారి మీద కేసులు పెట్టి  ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలు చేసే వారిన పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details