Illegal Mining for White Stone in Forest Lands: అక్రమంగా తెల్లరాయి మైనింగ్.. 9 భారీ యంత్రాలను సీజ్ చేసిన పోలీసులు - అటవీ భూముల్లో తెల్ల రాయి కోసం అక్రమ మైనింగ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 5, 2023, 2:47 PM IST
Illegal Mining for White Stone in Forest Lands:నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పెరుమలపాడు గ్రామ పరిసర అటవీ భూముల్లో అక్రమంగా తెల్ల రాయి కోసం భారీగా మైనింగ్ జరుగుతుంది. అధికార పార్టీ నాయకులు కావడంతో అటవీ శాఖ, మైనింగ్ పోలీస్ శాఖలు పట్టించుకోవడం ఆరోపణలు వస్తున్నాయి. ఆ గ్రామస్థులు గొడవ చేసి అడ్డుకోవడంతో ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు దాడులు చేశారు. 9 భారీ యంత్రాలను (ఇటాచి 200) అడ్డుకున్నారు. ఆయా వాహనాలు నెల్లూరుకు చెందిన వైసీపీ నాయకుడివి అని సమాచారం.
యంత్రాలను అటవీ అధికారుల నుంచి విడిపించేందుకు వైసీపీ నాయకుడు రంగంలోకి దిగారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్న వాహనాలను సీజ్ చేసి దుండగులపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఆందోళన తప్పదని గ్రామస్థులు అధికారుల సమక్షంలో భీష్మించారు. భారీ యంత్రాలతో నాలుగు నెలలగా మైనింగ్ మాఫియా అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని వాపోయారు. అటవీ భూముల్లో తెల్ల రాయి స్మగ్లింగ్‌ను అడ్డుకోవాలని అక్కడి గ్రామాల ప్రజలు జిల్లా అధికారులకు స్పందనలో గతంలో వినతి పత్రాలు ఇచ్చారు.