విజయవాడకు మద్యం అక్రమ తరలింపు - పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన దందా - illegal liquor in ap
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 18, 2024, 8:00 PM IST
Illegal Liquor Shipment in Vijayawada : విజయవాడ నగరంలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న మద్యం అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. హరియణా నుంచి విజయవాడకు ఖరీదైన బ్రాండెడ్ మద్యం సరఫరా జరుగుతోంది. నగరంలో గోడౌన్ ఏర్పాటు చేయడం వల్ల అక్రమ వ్యాపారం మరింత జోరుగా సాగుతోంది. ఈ అక్రమ మద్యం వ్యాపారంలో ఓ మాజీ ఆర్మీ ఉద్యోగి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు ఒక్కచోటే రూ.25 లక్షలు విలువైన ఇండియన్ మేడ్ ఫారిన్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Illicit Supply of Liquor Found in the Checks of the Police Officers : విజయవాడ పరిధిలో పీఎస్‌ల్లో జనవరి 1 నుంచి 15 వరకు చేసిన తనిఖీల్లో మొత్తం రూ. 90 లక్షల విలువ చేసే లిక్కర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 3.72 కోట్ల రూపాయల విలువ చేసే నగదు, ఆభరణాలు, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా సీపీ కాంతిరాణా తెలిపారు.