Jackfruit: విరగ కాసిన పనస.. వామ్మో చెట్టుకు ఎన్ని కాయలో..! - jackfruit tree can bear hundreds of fruits
Jackfruit: కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామంలో తలశిల వెంకట చలపతిరావు ఇంటి వద్ద పెంచుకున్న పనస చెట్టు వందల కాయలు కాసి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 5 సంవత్సరాల క్రితం విజయవాడ నర్సరీలో ఈ మొక్కను తీసుకొచ్చి నాటామని.. మొక్క నాటిన మూడు సంవత్సరాల నుండి కాయలు కాస్తున్నాయని చలపతిరావు తెలిపారు.. గత రెండు సంవత్సరాలుగా ఈ చెట్టుకు కాసిన కాయలు ఒక్కొక్కటి సుమారు యాభై కిలోల బరువు ఉంటుందని అన్నారు.. చెట్టుకు ఈ ఏడాది దాదాపు 150 కి పైగా పిందెలు వచ్చాయని చెప్పారు.. ఈ చెట్టు పెద్దది అవడం వలన ఎలాంటి ఎరువులు, పురుగు మందులు వాడటం లేదని.. వాటంతట అవే కాయలు కాశాయని తెలిపారు. ప్రస్తుతం 120కి పైగా కాయలు పెద్దయ్యాయని.. వాటిలో కొన్ని 10 నుంచి 12 కిలోలు మేర బరువు పెరిగాయని అన్నారు.
పనస చెట్టు ఎక్కువ కాయలు కాయడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి.. 7 సంవత్సరాల వయస్సు ఉన్న చెట్టు ఎక్కువగా కాయలు కాస్తాయి. ఈ చెట్టు కేవలం 5 సంవత్సరాల వయస్సులో కాయలు కాసింది. నెలలో పోషక విలువలను మొక్క ఎక్కువగా తీసుకోవడం వలన కాపు ఎక్కువగా కాసింది ఇలాంటి మొక్క నుండి ఇంకా ఎక్కువ మొక్కలు అంట్లు కట్టి రైతులకు సరఫరా చేస్తే వారు ఎక్కువ లాభాలు పొందుతారని పలువురంటున్నారు.