ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Govt bans protests rallies on Secretariat premises

ETV Bharat / videos

సచివాలయ ప్రాంగణంలో ర్యాలీ, ధర్నాలపై నిషేధం: సర్కులర్ జారీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2024, 9:54 PM IST

Govt bans protests rallies on Secretariat premises:ప్రభుత్వానికి తమ సమస్యలు విన్నవించడం, తమ సమస్యలను సీఎం మంత్రుల దృష్టికి తీసుకువెళ్లడానికి, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం సర్వసాధారణం. కానీ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు సచివాలయ ప్రాంగణంలో  ధర్నా చేసే విషయంలో  అశంపై ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది. నిబంధనలను అతిక్రమిస్తూ సచివాలయ ప్రాంగణంలో ధర్నాలు నిర్వహిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ర్యాలీ, ధర్నాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సచివాలయంలో ధర్నాలకు అనుమతి లేదని ప్రభత్వం స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని ఉద్యోగ సంఘాలు ర్యాలీలు, నినాదాలు చేయడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని తెలిపింది. కొందరు ఉద్యోగులు సీఎస్‌ కాన్వాయ్‌ అడ్డుకున్నారని, ధర్నా, నిరసనలకు ప్రభుత్నం నిరాకరించింది. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేస్తూ సీఎస్‌ కార్యాలయం సర్కులర్‌లను జారీ చేసింది. సచివాలయంలో సివిల్ సర్వీసు నిబంధనల మేరకు క్రమశిక్షణ పాటించాలని స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. 

ABOUT THE AUTHOR

...view details