ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Gold Robery Mystery Reveal In Police srikakulam district

ETV Bharat / videos

బంగారం మాయం కేసులో వీడిన మిస్టరీ - బ్యాంకు సిబ్బందే దోషులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2023, 10:26 PM IST

Gold Robbery Mystery Reveal in Police Srikakulam District: శ్రీకాకుళం జిల్లాలోని గార స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏడు కేజీల బంగారు ఆభరణాలు మాయం కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. బ్యాంకులో పని చేస్తున్న స్వప్నప్రియ, సురేష్‌, మరికొందరు ప్రైవేటు ఏజెన్సీ వ్యక్తులు ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. బ్యాంకు సీసీ టీవీ ఫుటేజ్‌ సాయంతో నిందితులను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహరమంతా దాదాపు సంవత్సరం నుంచి జరుగుతుందని పోలీసులు గుర్తించారు. ఈ కేసు పూర్తి వివరాలు జిల్లా ఎస్సీ రాధిక మీడియాకు తెలియజేశారు.

స్వప్నప్రియ, సురేష్‌ ఇద్దరు కలిసి బ్యాంకులో ఖాతాదారులు ఉంచిన బంగారాన్ని దొంగతనంగా తీసి తిరుమలరావుకు ఇచ్చేవారని ఆమె తెలిపారు. ప్రైవేేటు ఏజెన్సీస్​ల ద్వారా తిరుమలరావు వివిధ బినామీ పేర్ల మీద బ్యాంకు నుంచి తెచ్చిన బంగారాన్ని తాకట్టు పెట్టేవాడని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన బ్యాంకు ఉద్యోగి స్వప్నప్రియ ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించగా మరో ఏడుగురుని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు బ్యాంకు ఉద్యోగైన సురేశ్‌ కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details