Flexis Dispute: ఫ్లెక్సీల కలకలం.. "జగనన్న సురక్షలో మాకు కావాల్సిన న్యాయం ఇదే" - గనన్న సురక్షలో భాగంగా ఇంటింటికీ అధికారులు
Land Lossers Arranged Flexis:ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీకి ప్రజలు ఝలక్ ఇచ్చారు. వారు చేసిన పనికి స్థానిక వైసీపీ నాయకులకు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది. మైలవరం మండలంలోని వెల్వడం గ్రామంలో జగనన్న ఆదుకో అంటూ గ్రామస్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గ్రామంలోని ఇళ్ల ముందు గోడలకు పోస్టర్లు అంటించారు. ఈ చర్య స్థానికంగా కలకలం రేపింది. ఏడు సంవత్సరాల క్రితం రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన 130 కుటుంబాలకు న్యాయం చేయాలని.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పరిహారం వెంటనే చెల్లించాలని.. గ్రామంలో రహదారి వెంబడి ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఫ్లెక్సీలలో ముద్రించి ఉంది. తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లండి.. జగనన్న సురక్షలో మీరు మాకు చేయాల్సిన న్యాయం ఇదే అంటూ గ్రామ ఎంట్రన్స్‌లో మరో ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. నేటి నుంచి జగనన్న సురక్షలో భాగంగా ఇంటింటికీ అధికారులు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామస్థులు ఈ చర్యకు ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది.