ఆంధ్రప్రదేశ్

andhra pradesh

fishing_boat_accident_in_bhimunipatnam_beach

ETV Bharat / videos

చేపల వేటకు బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం, పది లక్షల రూపాయలు ఆస్తి నష్టం - విశాఖ ఫిషింగ్‌ తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2023, 12:12 PM IST

Fishing Boat Accident in Bhimunipatnam Beach : విశాఖ జిల్లాలోని భీమునిపట్నం బీచ్​ నుంచి చేపల వేటకు బయలుదేరిన బోటు కొద్ది గంటల్లోనే ప్రమాదానికి గురైంది. స్థానికుల వివరాల మేరకు విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌కు చెందిన మత్స్యవేట బోటు నిన్న సాయంత్రం భీమిలి బీచ్​ నుంచి బయలుదేరగా కొద్ది గంటల్లోనే ప్రమాదవశాత్తు ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. బోట్లో ఉన్న ఎనిమిది మంది మత్స్యకారులు ఈదుకుంటూ సురక్షితంగా బయట్టపడ్డారు. ఈ బోటు ప్రమాదం కారణంగా సుమారు పది లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని దానయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని దానయ్య కోరారు. 

Fishing Boat Problem in Visakhapatnam :బోటు వెనక్కి కొట్టుకుపోతోందని గమనించి అప్రమత్తమైన మత్స్యకారులు నీటిలోకి దూకారు. ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చి ప్రాణాలనైతే కాపాడుకున్నారు. ఆకస్మికంగా ఎదురైన ఈ పెను ప్రమాదానికి మత్స్యకారులు భయాందోళనకు గురయ్యారు. రూ. లక్షల్లో నష్టం జరగడంలో బోటు యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details