ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Fire_Accident_in_a_Car_at_Mantralayam

ETV Bharat / videos

పెట్రోల్‌ బంకు వద్ద అగ్నిప్రమాదం- మంటల్లో కారు దగ్ధం - అగ్ని ప్రమాదం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2024, 1:14 PM IST

Fire Accident in a Car at Mantralayam: కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఓ పెట్రోల్‌ బంకు వద్ద ఓ కారు మంటల్లో కాలి పూర్తిగా దగ్ధమైంది. వాహనంలో నుంచి పొగలు రావడం గమనించి కారులో ఉన్నవారంతా ముందుగానే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఎమ్మిగనూరు నుంచి ఎమ్మిగనూరు నుంచి ఫైర్‌ ఇంజిన్‌(Fire Engine) వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది.

Car burnt in Fire Accident: పొగలు వ్యాపించిన నిమిషాల వ్యవధిలోనే కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రయాణికులు రాయచూర్‌ నుంచి తిరిగి మంత్రాలయంకు వస్తుండగా మార్గమధ్యలో ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద(Fire Accident at Petrol Bunk) ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలనలు చేపట్టారు. అయితే కారులో ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

ABOUT THE AUTHOR

...view details