మంత్రి సీదిరి అప్పలరాజు సవాల్ విసిరి తోక ముడిచాడు: కొల్లు రవీంద్ర - బీసీ సంక్షేమం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 6:40 PM IST
|Updated : Dec 27, 2023, 7:31 PM IST
EX Minister Kollu Ravindra Fires On Sidiri Appalaraju : బీసీ సంక్షేమం, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమంటూ మంత్రి సీదిరి అప్పలరాజుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో కొన్ని గంటల పాటు సీదిరి కోసం వేచి చూశారు. నారా లోకేష్‌కు బహిరంగ సవాల్ చేసిన సీదిరి అప్పల రాజు దమ్ముంటే తనతో చర్చించాలని కొల్లు రవీంద్ర అక్కడే కూర్చున్నారు.
Kollu Ravindra Challenge to Sidiri Appalaraju :సవాల్ విసిరినంత సూటిగా సీదిరి అప్పలరాజు చర్చకు ఎందుకు రాలేదని కొల్లు రవింద్ర ధ్వజమెత్తారు. విజయవాడ ప్రెస్ క్లబ్ వద్దకు ఈరోజు ఉదయం 11 గంటలకు రావాలని మంత్రికి ముందే సమాచారం ఇచ్చినా రాకపోవటాన్ని తప్పుబట్టారు. ఈ సందర్భంగా కొల్లు మాట్లాడుతూ బీసీలను అన్ని విధాలా అణగ దొక్కిన చరిత్ర జగన్‌రెడ్డిదని ధ్వజమెత్తారు. చర్చకు రాకుండా సీదిరి తోక ముడిచారని రవీంద్ర దుయ్యబట్టారు.