Kalva Srinivasulu death initiation కాల్వ శ్రీనివాసులు ఆమరణ దీక్ష..! బాబు ప్రజల సొత్తు.. విడుదల అయ్యే వరకు దీక్షలోనే అన్న మాజీ మంత్రి - మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆమరణ దీక్ష
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 22, 2023, 4:49 PM IST
Ex-minister Kalva Srinivasulu death initiation : నారా చంద్రబాబునాయుడుకు మద్దతుగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆమరణ దీక్ష చేపట్టారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులతో కలిసి దీక్ష ప్రారంభించారు. కాల్వ శ్రీనివాసులు దీక్షకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పూర్తి మద్దతు ప్రకటిస్తూ పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ బాబును రాజమండ్రి జైలులో చంపాలని కుట్ర పన్నినట్లు కాలవ శ్రీనివాసులు తెలిపారు.
చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొత్తు అని, ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ (Telugudesam Party) శ్రేణుల పైన ప్రజల పైన ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుపై మేధావులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, ప్రజలు గళం విప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నారా చంద్రబాబు నాయుడు విడుదలయ్యేంతవరకు రాయదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ (NTR) విగ్రహం పక్కన తాను నిరాహార దీక్ష కొనసాగిస్తానని కాల్వ శ్రీనివాసులు ప్రకటించారు. ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా రాయదుర్గం పట్టణం, నియోజకవర్గంలోని ఐదు మండలాల టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి.