దేవుడి భూములకు దిక్కెవరు.. లక్షల ఎకరాల్లో దేవాదాయశాఖ భూములు కబ్జా..
PRATIDWANI : రాష్ట్రవ్యాప్తంగా దేవుడి ఆస్తులు దొరికితే దోచేస్తున్నారు తప్ప.. కాపాడే వారే కరవయ్యారంటూ తాజాగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు కోర్టు ఎందుకు అంతటి తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఆలయాల ఆస్తుల నిర్వహణ ఎలా ఉంది. అని సందేహం రాక మానదు. 4 లక్షల ఎకరాల్లో 1 లక్ష ఎకరాలు కబ్జాలో ఉన్నట్లు.. గతంలో స్వయంగా దేవాదాయశాఖ కమిషనరే చెప్పారు. ఎందుకిలా కబ్జాలకు గురి అవుతోంది. ప్రస్తుతం ఆ శాఖ అధికారుల తీరుపైనే తీవ్ర విమర్శలు ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కయ్యారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయాల ఆస్తులపై రాజకీయ పెత్తనం ఎందుకు పెరిగింది. రాష్ట్రంలో సీజీఎఫ్ నిధుల వినియోగంపైనా వివాదాలు.. ఆలయాల పునరుద్ధరణకు ఉపయోగించాల్సిన నిధులను, రాష్ట్రంలో ఇతర అవసరాల పేరిట ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అసలు ఆలయాల ఆస్తుల పరిరక్షణ బాధ్యతలు ఎవరు నిర్వర్తించాలి. వీటన్నింటికి సమాధానమే నేటి ప్రతిద్వని కార్యక్రమం.