ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రతిధ్వని

ETV Bharat / videos

Prathidwani: సంపద సృష్టించడంలో ఎందుకీ ప్రభుత్వం విఫలం అవుతోంది?

By

Published : May 6, 2023, 9:05 PM IST

అప్పు మీద అప్పు... ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు. అప్పులబాటలో ఎన్నాళ్లు ఇలా రాష్ట్ర ప్రయాణం? పన్ను మీద పన్నుతో వాతలు తేలుతున్నాయి. అడ్డుగోలుగా పెంచిన అనేక ఛార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. అయినా.. ఇన్ని అప్పులు ఎందుకన్నది ఒక ప్రశ్న అయితే... తెచ్చిన అప్పులన్నీ ఏం చేస్తున్నారన్నది మరో ప్రశ్న. అసలు వచ్చిన ఆదాయం అంతా ఏమవుతోంది? ఇప్పటికైతే అప్పులు తెస్తున్నారు. ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి అనుకున్నా.. రానున్న తరాలపై ఈ రుణభారం ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? రాష్ట్రం వేగంగా.. కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలో జారిపోతోందన్న నిపుణుల ఆందోళనలు ఎందుకు?  ఓ పక్కన ప్రజలపై విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు, ఆస్తిపన్ను, చెత్తపన్ను, ఇలా రకరకాల పేర్లతో బాదుతున్నారు. మరోపక్క అప్పులు చేస్తున్నారు. సంపద సృష్టించడంలో ఎందుకీ ప్రభుత్వం విఫలం అవుతోంది?  ఎప్పుడూ అప్పులు... తిప్పలే కనిపిస్తున్నాయి. అసలు రాష్ట్ర సొంత ఆదాయాలు, పరిశ్రమలు, ఇతర మార్గాల్లో రాబడులు ఎందుకు పెంచుకోలేక పోతున్నారు?  ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details