prathidwani దావోస్ దాచిన సత్యాలు - ప్రతిధ్వని కార్యక్రమం
స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో ఏటా పెద్దపెద్ద పెట్టుబడిదారులు అందరూ ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సుకు హాజరవుతారు. అనేక దేశాలు, రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడికి వెళ్లి తమవద్ద పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలు వారికి వివరించి... ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆకర్షిస్తూ ఉంటారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... దావోస్ వెళ్లడమూ, పెట్టుబడులు ఆకర్షించడం లోనూ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. దావోస్ వేదికగా ఏ మేరకు పెట్టుబడులను ఆకర్షించింది? ఈ సంవత్సరం ఆ సదస్సుకు ఎందుకు హాజరు కావడం లేదు? ఇవే అంశాలపై నేటి ప్రతిధ్వని.