Election Commission Serious on Kavali Votes Cancellation: కావలిలో టీడీపీ, జనసేన సానుభూతి ఓట్లు తొలగింపు.. ఎన్నికల కమిషన్ ఆగ్రహం - Kavali Constituency News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 10, 2023, 5:51 PM IST
Election Commission Serious on Kavali Votes Cancellation:ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వాలంటీర్ల ద్వారా టీడీపీ, జనసేన సానుభూతి ఓట్లను తొలగిస్తూ.. వందలకొద్దీ దొంగ ఓట్లను చేర్చుతున్న ఉదంతాలు దర్శనమిస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో తొలగించిన ఓట్ల వ్యవహారంపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తొలిగించిన ఓట్ల వ్యవహారంపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
Janasena, TDP Leaders Comments: ఓట్ల తొలగింపు కోసం గత నెల 28, 29 తేదీల్లో వైఎస్సార్సీపీ నాయకులు 8వేల 893 దరఖాస్తులు చేయటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎన్నికల కమిషన్.. కావలి ఓట్ల తొలగింపుపై విచారణ చేపట్టేందుకు 'డోర్ టూ డోర్ సర్వే' బాధ్యతను బిఎల్‌ఓలకు అప్పగించింది. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన నాయకులు మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. కావలి నియోజకవర్గంలో మొత్తం ఒక లక్ష 40,000 ఓట్లు ఉండగా.. వాటిలో 22వేల 92 ఓట్లు అడ్రస్ లేనివిగా ఉన్నాయన్నారు. కేవలం కావలి పట్టణంలోనే 17,500 దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించటం జరిగిందన్నారు. నిర్దిష్టమైన ఓట్లు ఉండాలని ఎన్నికల కమిషన్ డోర్ టు డోర్ సర్వే నిర్వహించినప్పటికీ.. ఆ సర్వేలో సచివాలయ సిబ్బంది ఉండడంతో అవగాహనరాహిత్యం లోపించిందని విమర్శించారు.