ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Dussehra_Celebrations_Oxe_Cart_Contests

ETV Bharat / videos

Dussehra Celebrations Oxe Cart Contests: అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు.. ఎడ్ల బండ్ల పోటీలు అదుర్స్ - సత్యసాయి జిల్లా లేటెస్ట్ న్యూస్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2023, 1:12 PM IST

Dussehra Celebrations Oxe Cart Contests: రాష్ట్రవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దసరా సందర్భంగా ఆయా జిల్లాలో వివిధ రకాల ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

ఈ క్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా కాలసముద్రంలో దసరా సందర్భంగా.. సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఎడ్ల బండ్ల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా స్థాయి ఎడ్ల బండ్ల పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు తమ ఎద్దులతో.. తరలివచ్చి పోటీలో పాల్గొన్నారు. ఈ ఎడ్లబండ్ల పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. పోటీ బరిలో నిలిచిన ఎద్దులను ఉత్సాహపరుస్తూ.. కేరింతలతో రైతులు, యువకులు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి.. పోటీ విజేతలకు నగదు బహుమతులను ప్రదానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details