ఆంధ్రప్రదేశ్

andhra pradesh

disruption_of_drinking_water_supply

ETV Bharat / videos

అధికారుల నిర్లక్ష్యంతో నిలిచిన తాగునీటి సరఫరా - స్థానికులతో కలిసి మేయర్​ భర్త నిరసన - నిరసనకు దిగిన నెల్లూరు జిల్లా వాసులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2023, 3:29 PM IST

Disruption of Drinking Water Supply : మిగ్​జాం తుపాను తాకిడికి తాగునీరు అందక నెల్లూరు జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు కార్పోరేషన్​ మేయర్ స్రవంతి​ ప్రాతినిధ్యం వహించే 12వ వార్డు వావిలేటిపాడులో కరెంటు సమస్య కారణంగా నీటి కొలాయిలకు సరఫరా నిలిచిపోయింది. రెండు రోజులు నుంచి నీటి సరఫరా లేకపోవడం వల్ల స్థానికులు మేయర్​ భర్త అయినా జయవర్ధన్​కు సమాచారం ఇచ్చారు. 

సమాచారం అందించిన మొదటి రోజు నీరు అందించడం సాధ్యం కాలేదు. రెండో రోజు కూడా అదే పరిస్థితి ఏర్పడం వల్ల వార్డు ప్రజలు మేయర్​ భర్తను నిలదీశారు. దీంతో ఆయన కార్పోరేషన్ అధికారులతో మాట్లాడి సంబంధిత వార్డుకు ఉదయమే నీళ్లు ట్యాంకర్​ పంపించమని కోరారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సాయంత్రం అయినా నీళ్లు ట్యాంకర్​ను పంపించలేదు. దీంతో ఆయన గ్రామస్థులతో కలిసి స్థానిక సచివాలయం వద్ద నిరసన తెలిపారు. ఒక్క వాటర్​ ట్యాంకర్​ను పంపించడానికి కార్పోరేషన్ అధికారులకు ఎందుకు అంత నిర్లక్ష్యమని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details