ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Rjajanna Dora

ETV Bharat / videos

Rajanna Dora on Elections: రాష్ట్రంలో ఎన్నికలు అప్పుడే.. ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి: ఉపముఖ్యమంత్రి - Rajanna Dora

By

Published : May 19, 2023, 10:43 PM IST

Updated : May 19, 2023, 11:02 PM IST

D CM Rajanna Dora on Elections: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తెలిపారు. అలాగే ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయితే రాష్ట్రంలో ఎన్నికలు డిసెంబర్‌లోనో, జనవరిలోనో వస్తాయని ఉపముఖ్యమంత్రి రాజన్న దొర తెలిపారు. గతంలో కూడా డిసెంబర్‌లోనే షెడ్యూల్‌ ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఎవరి మంచివారో... ఎవరు చెడ్డవారో.... ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ... ఏ ప్రభుత్వ హయాంలో పరిపాలన బాగుందో.... ఎవరి పరిపాలన బాగోలేదో..... అన్ని అంశాలను బేరీజు వేసుకుని ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 

ఎవరు మంచివారు, ఎవరు చెడ్డ వారు.. ఎవరి పరిపాలన బాగుందో.. ఎవరి పరిపాలన బాగలేదో..ప్రజలంతా బేరీజు చేసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది కాబట్టి, ఎన్నికలనేవి డిసెంబర్‌లోనో, జనవరిలోనో వస్తాయి. గతంలో కూడా డిసెంబర్‌ 25న షెడ్యూల్‌ ప్రకటించారు. కాబట్టి ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. -రాజన్న దొర, ఉపముఖ్యమంత్రి

Last Updated : May 19, 2023, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details