అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి : సీపీఐ కార్యదర్శి రామకృష్ణ - ఏపీ తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 5:50 PM IST
Demand to Solve Anganwadi Problems :సమస్యల పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న అంగన్వాడీలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
CPI Secretary Condemned the Arrest of Anganwadi Workers : రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించకుండా దాట వేస్తుందని రామకృష్ణ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో కన్నా అదనంగా వేతనాలు చెల్లింస్తామని చెప్పి అధికారంలోకి రాగానే అంగన్ వాడీ కార్యకర్తలను సీఎం జగన్ మోసం చేశాడని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లను నెరవేర్చకుండా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం ఏంటి అని ప్రశ్నించారు.