శ్యామ్‌కుమార్‌పై దాడిని ఖండించిన దళిత సంఘాలు - సత్వర చర్యలు చేపట్టకపోతే ఆందోళనలు విస్తృతం చేస్తామంటూ హెచ్చరిక
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 4, 2023, 6:31 PM IST
Dalitha Hakkula Porata Samithi Condemned the Attack on Shyamkumar:వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని.. దళిత హక్కుల పోరాత సమితీ నేతలు అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కంచికర్లకు చెందిన దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఎన్టీఆర్ జిల్లా కు చెందిన దళిత యువకుడు శ్యామ్ కుమార్‌ను కొంత మంది దుండగులు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేయడమే కాకుండా దీంతో పాటు తాగేందుకు మంచి నీళ్లు అడిగితే శ్యామ్ కుమార్‌పై మూత్రం పోశారని దళిత సంఘల నేతలు తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ దాడిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో అన్ని దళిత సంఘాలను కలుపుకొని ఆందోళన చేపడతామని హెచ్చరించారు.