ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ycp_bus_yatra

ETV Bharat / videos

వైసీపీ చేపట్టింది సామాజిక బస్సుయాత్ర కాదు - దళిత నయవంచన యాత్ర: దళిత సంఘ నాయకులు - AP Latest News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 19, 2023, 3:35 PM IST

Dalit Community Leaders on YCP Bus Yatra:వైసీపీ చేపట్టింది సామాజిక బస్సుయాత్ర కాదని వైసీపీ దళిత నయవంచన యాత్ర అని కడప దళిత సంఘం నాయకులు ఓబన్న ఆరోపించారు. 23న కడపలో జరగనున్న సామాజిక బస్సుయాత్ర అడ్డుకుంటామని వారికి వ్యతిరేకంగా వినూత్న కార్యక్రమం చేపడతామని ఆయన అన్నారు. దళితులకు చెందాల్సిన రాయితీలను, హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాశిందని విమర్శించారు. నవరత్నాల పైన దృష్టి పెట్టారే తప్ప దళితులకు చెందాల్సిన సబ్సిడీ రుణాల విషయంలో తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.

దళితులకు వచ్చే నిధులు అన్నింటిని సీఎం జగన్ దారి మళ్లించి నవరత్నాలకు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఆయన దళితులకు ఏం చేశారనేది చెప్పిన తర్వాతనే బస్సు యాత్రను ప్రారంభించి ఉంటే బాగుండేదని చెప్పారు. గతంలో ఉన్న దళిత పథకాలన్నింటిని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఉన్న దళిత మంత్రులు తక్షణం తమ పదవులకు రాజీనామా చేసి దళితులకు ఏం చేశారని ముఖ్యమంత్రిని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. జగన్ సర్కార్లో దళితుల హత్యలు, దాడులు అత్యాచారాలు తప్ప మరి ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details