Cyber Crime With Fake Fingerprints in AP: నకిలీ వేలిముద్రలతో ఖాతా ఖాళీ చేసేస్తారు జాగ్రత్త సుమీ: సైబర్ పోలీసులు - ఏపీలో సైబర్ నేరాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 2:06 PM IST
Cyber Crime With Fake Fingerprints in AP :సైబర్ నేరస్తులు ఎప్పటికప్పుడు నూతన పంథాను ఎంచుకుంటున్నారు. ప్రజల అవసరాల్ని ఆసరాగా చేసుకుని దోచేస్తున్నారు . ఆధార్ ఇప్పుడు ప్రతీ పథకానికి కీలకంగా మారింది . దీంతో ఆధార్ అప్ డేట్ పేరుతో అక్రమార్కులు నయాదందా మొదలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు నగదు డ్రా చేసుకునేందుకు సులువుగా ఉంటుందని ఆధార్ బేస్డ్ లావాదేవీలను అమలు చేసింది. దీనికి ప్రత్యేకంగా కామన్ సర్వీస్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేసింది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వేలిముద్ర వేసి బ్యాంక్ ఖాతా నుంచి నగదు డ్రా (Money Withdraw From Fingerprints) చేసుకోవచ్చు. ఒక్క రోజులో విడతల వారీగా 10 వేలను డ్రా చేసుకునే అవకాశముంటుంది.
Beware of Aadhaar Update Messages from Unknown Numbers :దీన్ని అవకాశంగా తీసుకుని నేరస్తులు నకిలీ వేలిముద్రలు తయారు చేస్తున్నారు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వేలిముద్ర వేసి నగదును దర్జాగా కాజేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. మరికొంతమంది సైబర్ కేటుగాళ్లు మీ ఆధార్ కార్డ్ గడువు ముగుస్తుంది. వెంటనే మీ KYC ని అప్ డేట్ చేసుకోండి అంటూ మెస్సేజ్ పంపుతూ OTP చెప్పగానే బ్యాంక్‌లోని నగదుని స్వాహా చేస్తున్నారని.. ప్రజలు ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.