Cracked clay mounds in Nellore district : కాంక్రీట్ పనులు చేస్తుండగా ఊడిపడిన మట్టి పెళ్లలు.. పరుగులు తీసిన కూలీలు.. ఇదిగో వీడియో!
Cracked clay mounds in Nellore district ::నెల్లూరు జిల్లా సంగం బస్‌స్టాండ్ సమీపంలో.. నిర్మాణంలో ఉన్న దువ్వూరు కాలువ ప్రధాన రెగ్యులేటర్ వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. నెల్లూరు- ముంబయి జాతీయ రహదారి పక్కన బస్టాండ్ కూడలికి సమీపంలో.. ప్రధాన రెగ్యులేటర్ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా కూలీలు ఎడమ వైపున కాంక్రీట్ పనులు చేస్తున్నారు. కాంక్రీట్ పనులు చేసుకుంటూ మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే ఉన్నవారు.. వెలుపలికి రాగా.. 12.02నిమిషాలకు గట్టు పైభాగం నుంచి భారీగా మట్టి పెళ్లలు విరిగి ఆ ప్రాంతంలో పడ్డాయి. కేవలం రెండు నిమిషాల వ్యవధిలో ఈ సంఘటన జరిగింది. గట్టు పైభాగం నుంచి మట్టి పెళ్లలు ఒక్కసారిగా విరిగి పడేసరికి.. పైన ఉన్న వారు కేకలు వేయడంతో అప్రమత్తమైన కూలీలు అక్కడి నుంటి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. ఉన్నట్టుండి పెద్దపెద్ద మట్టి పెళ్లలు ఉడిపడటంతో భయందోళనకు గురైన కూలీలు.. ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.