చంద్రన్న సంక్రాంతి సంబరాలు - అంబరాన్నంటేలా మహిళా కబడ్డీ పోటీలు - చంద్రన్న సంక్రాంతి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 15, 2024, 1:25 PM IST
Chandranna Sankranthi Sambaralu : ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో చంద్రన్న సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బి. ఎన్. వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆరికట్ల సుమతి మహిళలకు వివిధ పోటీలు నిర్వహించారు. చీమకుర్తిలో నాలుగు రోజులపాటు ముగ్గుల పోటీలు జరిపారు. ఏడు జిల్లాల నుంచి వచ్చిన మహిళల క్రీడాకారులతో కబడ్డి పోటీలు నిర్వహించారు. కబడ్డీ పోటీలో మహిళా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని అలరించారు.
ముగ్గుల పోటీలను నియోజకవర్గంలోని పలు గ్రామాల పరిధిలో గత నాలుగు రోజులుగా నిర్వహించారు. అందులో ఎంపికైనా వారికి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించారు. ఈ పోటీలను చీమకుర్తిలో నిర్వహించగా, విజేతలుగా నిలిచిన మొదటి ముగ్గురికి నగదు బహుమతి చేశారు. ముగ్గులపోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందించారు. అంతరించిపోతున్న గ్రామ కళలు, సంప్రదాయాలను మహిళల్లో ఉత్తేజపరచడానికి ముగ్గుల పోటీలను నిర్వహించినట్లు ఆరికట్ల సుమతి వివరించారు. తెలుగుదేశం తరపున రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో చంద్రన్న సంక్రాతి సంబరాల పేరుతో పలు రకాల పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.