దిల్లీలో చంద్రబాబుకు ఘన స్వాగతం - డిసెంబర్ మొదటివారం నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి - Chandrababu Tirupati Tour
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 27, 2023, 6:54 PM IST
Chandrababu to Delhi: తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిసెంబర్ మొదటి వారం నుంచి.. మళ్లీ పూర్తి స్థాయి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కుమారుడి పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు.. సోమవారం ఆయన దిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో చంద్రబాబు దిల్లీ బయల్దేరి వెళ్లారు. దిల్లీ విమానాశ్రయంలో చంద్రబాబు దంపతులకు.. ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, రఘురామకృష్ణంరాజు, కింజారపు రామ్మోహన్ నాయుడు తదితరులు స్వాగతం పలికారు.
Chandrababu Tirumala Tour: వివాహ వేడుకలు ముగిసిన అనంతరం అక్కడి నుంచి.. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు చంద్రబాబు ఈ నెల 30వ తేదీన సాయంత్రం తిరుపతి వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి 1వ తేదీన ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అదేరోజు సాయంత్రం అమరావతిలోని ఆయన నివాసానికి చేరుకోనున్నారు. ఆ తర్వాత రోజుల్లో బెజవాడ దుర్గమ్మ, సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళతారని పార్టీ నేతలు వివరించారు. కంటి ఆపరేషన్ తర్వాత కొద్దిరోజులుగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోనే విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.