Chandrababu Tour: నేడు నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటన.. - ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు
Chandrababu Nandyala Tour: 10రోజుల పాటు రాష్ట్రంలోని జలవనరుల ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేడు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందంటూ.. క్షేత్ర స్థాయిలోని స్థితిగతులను ప్రజానికానికి వివరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అందులో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గంలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, పాములపాడు మండలంలోని బనకచర్ల హెడ్ రెగ్యులేటరీలను పరిశీలించనున్నారు. బనకచర్ల వద్ద ఫోటో ప్రదర్శన, మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 11 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నందికొట్కూరు చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డుషో నిర్వహిస్తారు. అనంతరం పటేల్ సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో బాబు మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించనున్నారు. సాయంత్రం నాలుగున్నరకు పాములపాడు మండలంలోని బనకచర్ల హెడ్ రెగ్యులేటరీకి చేరుకుని... అక్కడే మీడియాతో మాట్లాడనున్నారు. సాయంత్రం 6 గంటలకు బయలుదేరి.. రోడ్డు మార్గంగుండా కడప జిల్లాలోని జమ్మలమడుగు వెళ్లనున్నారు.