ఆంధ్రప్రదేశ్

andhra pradesh

chandrababu_house_in_special_pooja_for_three_days

ETV Bharat / videos

చంద్రబాబు నివాసంలో నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు - Chandrababu Yesterday Visit In Merimatha Temple

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 10:50 AM IST

Chandrababu House In Special Pooja For Three Days: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని ఆయన నివాసంలో నేటి నుంచి పండితులు శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమం చేయనున్నారు. మూడు రోజుల పాటు యాగం, హోమం, ప్రత్యేక పూజల్లో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పాల్గొనున్నారు. 

Chandrababu Yesterday Visit In Merimatha Temple:అలాగే గురువారం రాత్రి విజయవాడలోని గుణదల మేరిమాతను చంద్రబాబు, భువనేశ్వరి కలిసి దర్శించుకున్నారు. మేరిమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. లోకేశ్ యువగళం విజయోత్సవ సభకు ఆయన హజరైయ్యారు. సభ ముగించుకుని అనంతరం విశాఖ నుంచి గన్నవరం ఎయిర్​పోర్టుకు చంద్రబాబు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్​పోర్టులో ఆయనకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. 

ABOUT THE AUTHOR

...view details