ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కళ్లలో కారం కొట్టి డబ్బు అపహరించిన దుండగులు - సీన్ రక్తి కట్టించినా పట్టేసిన పోలీసులు - పోలీసుల ప్రాథమిక విచారణ

🎬 Watch Now: Feature Video

cash_theft_in_anantapur_district

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2023, 1:41 PM IST

Cash Theft at IDBI Bank in Anantapur district :అనంతపురం జిల్లాలో ఐడీబీఐ బ్యాంక్​ వద్ద ఓ ఏంజెట్​ నుంచి 46 లక్షల రూపాయలను దుండగులు చోరీ చేసిన విషయం కలకలం రేపింది. ఏజెంట్​ పోతురాజు కళ్లలో కారం కొట్టి నలుగురు అనుమానితులు నగదును అపహరించారని పేర్కొన్నాడు. నిర్బంధించిన అతడిని స్థానికులు గమనించి విడిపించారని పేర్కొన్నాడు. అనంతరం పోతురాజు పోలీస్​ స్టేషన్​కు వెళ్లి వారిపై కేసును నమోదు చేశాడు. 

Police Interrogating the Insulted :తనపై దాడి చేసి నిర్బంధించి నగదు దోచుకెళ్లినట్లు ఏజెంట్​ పోతురాజు పోలీసులకు తెలిపారు.పోలీసులు రంగంలోకి దిగి నలుగురు అనుమానితులను పట్టుకొని విచారించారు. అనంతరం పోతురాజును కూడా విచారించగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. డబ్బు కోసం స్నేహితులతో కలిసి నగదు దొంగతనం చేసినట్లు డ్రామా ఆడినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అన్భురాజన్​ తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలుపుతామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details