Amaravati Farmers Pooja: ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ.. రైతుల పూజలు
Amaravati Farmers Pooja: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమరావతిని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని రాజధాని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమరావతిని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని రాజధాని మహిళలు ఆరోపించారు. ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ.. తొలి ఏకాదశి పురస్కరించుకొని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో రైతులు ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని దేవతలకు సారె సమర్పించారు. పోలేరమ్మ, శివ పార్వతులకు, ఆంజనేయస్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రైతులు.. అమరావతి అభివృద్ధికి ఉన్న ఆటంకాలన్నీ తొలగి పోవాలని దేవతలను వేడుకున్నట్లు చెప్పారు. న్యాయస్థానాలలో అమరావతిపై కేసులు ఉన్నాయని తెలిసి.. కేంద్రం ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఎలా ఇస్తుందని రైతులు ప్రశ్నించారు. అమరావతి రైతులను ప్రభుత్వం మోసం చేసిందని మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్న ప్రభుత్వం త్వరగా దిగిపోవాలని పూజలు చేసినట్లు రైతులు తెలిపారు.