ఆంధ్రప్రదేశ్

andhra pradesh

burial_in_mud_flood_water_in_guntur_district

ETV Bharat / videos

అంత్యక్రియలకు ఎన్ని కష్టాలో - బురదలో యువకుడి మృతదేహం ఖననం - స్మశానంలో నీరు పట్టించుకోని అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2023, 3:19 PM IST

Burial in Mud Flood Water in Guntur District : తుపాను వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు ఎదురయ్యాయి. పంటలు నష్టపోయి రైతులు, ఇళ్లలోకి నీళ్లు వచ్చి సామాన్యులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆఖరికి చనిపోయిన వారి అంత్యక్రియలు కూడా సరిగా నిర్వహించలేని దుస్థితి పలు చోట్ల ఎదురైంది. ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లా కాకుమాను ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. ఎస్సీ యువకుడు సునీల్‌ మృతి చెందడంతో మతృదేహాన్ని మోకాళ్లలోతు నీటిలో బంధువులు శ్మశానానికి తీసుకెళ్లారు. తుపాను వల్ల కురిసిన వర్షంతో శ్మశానంలో పెద్ద ఎత్తున నీరు చేరడంతో అంత్యక్రియలకు ఇబ్బంది ఏర్పడింది. మృతదేహానికి అంత్యక్రియలు చేపట్టడానికి స్థలమే లేకుండా పోయింది. 

Dead Body is Placed into Flood Water in Ap : దీంతో బంధువులు ప్రొక్లెయిన్ తెప్పించి ఓ ప్రదేశంలో కట్టలు వేయించారు. వాటి మధ్యలో ఉన్న నీటిని ఆయిల్‌ ఇంజిన్లతో తోడించారు. చివరికి బురద మట్టిలో యువకుడి మృతదేహాన్ని ఖననం చేయాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా పంచాయతీ అధికారులు, మురుగునీటి పారుదల సిబ్బంది పట్టించుకోలేదని మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్మశానవాటిక చుట్టూ ప్రహరీ నిర్మిస్తే సమస్య వచ్చేదే కాదని చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details