టీడీపీ హయాంలోని పథకాలను వైసీపీ నిలిపివేసింది: భవన నిర్మాణ కార్మికులు - Building Employs Protest
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 3:57 PM IST
Building Construction Employees Protest In Vizag: విశాఖపట్నం జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ (Greater Vishakhapatnam Municipal Corporation) గాంధీ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. టీడీపీ హయాంలో కార్మికులకు సంక్షేమ పథకాలు అన్నీ అమలయ్యేవని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయంగా నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
YSRCP Government Stopped Schemes Implemented During TDP: ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ గతంలో బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలయ్యేవని, వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఆ నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 నుంచి పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ గాంధీ పార్క్లో నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని లేకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.