భక్తుల కొంగుబంగారం ఈశ్వరయ్య క్షేత్రం.. బ్రహ్మోత్సవాలకు ముస్తాబు.. - Brahmotsavams at Iswaraiah Kshetra
తిరుపతి జిల్లా డక్కిలి మండలం దేవుని వేలంపల్లిలోని స్థంభాలగిరి ఈశ్వరయ్య క్షేత్రంలో ఆదివారం నుంచి 4 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శతాబ్ధాలుగా ఎంతో వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో రెండో రోజు అనగా ఈ నెల 10వ తేదీ సోమవారం రాత్రి జరిగే శివపార్వతీల కల్యాణోత్సవం, అర్ధ రాత్రి జరిగే గ్రామోత్సవాలను దర్శించి పునీతులు అవడానికి నెల్లూరు, తిరుపతి, కడప ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ మేరకు అనేక రకాల ఏర్పాట్లు చేస్తుండగా ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరుతూ.. ఆలయ పాలకవర్గంతో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ చైర్మన్ నర్రావుల ప్రకాశం మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల నిర్వహణలో భక్తులకు ఏ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వివిధ ఆర్టీసీ డిపోల నుంచి 20బస్సులను సోమవారం నడుపుతారని చెప్పారు. ఆదివారం అంకురార్పణ, ధ్వజారోహణం, సోమవారం కల్యాణం, గ్రామోత్సవం, మరుసటిరోజు వసంతోత్సవాన్ని చివరగా ధ్వజారోహణంతో తిరునాళ్ళు ముగుస్తాయని పేర్కొన్నారు.