BJP Vishnukumar Reaction on Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ గురించి తెలియదని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉంది: విష్ణుకుమార్ - Liquor scam in AP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 11, 2023, 7:50 PM IST
BJP Vishnukumar Reaction on Chandrababu Arrest: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ గురించి తనకు తెలియదని సీఎం జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈ అరెస్టు బాధ్యత అంతా బీజేపీ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. వాస్తవంగా చంద్రబాబు అక్రమ అరెస్టుకి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు అని ఆయన తేల్చి చెప్పారు.
'చంద్రబాబు అరెస్టును ఖండిస్తే.. తెలుగుదేశం పార్టీ వారు అని అంటున్నారు.. వైసీపీ నేతలు ప్రతిపక్ష పార్టీలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు' అని విష్ణుకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేస్తున్న అరాచకాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు.. మీకు, మీ వ్యంగ్యానికి 2024లో ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ.. కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. మద్యంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించిన ఆయన.. సీబీఐ దర్యాప్తు చేయించాలని రెండేళ్ల కిందటే డిమాండ్ చేసినట్టు గుర్తు చేశారు.