Bhola Shankar Ticket Price Issue : భోళాశంకర్ సినిమా టికెట్ల ధరల పెంపు కోసం ప్రభుత్వ అనుమతి కోరిన చిత్రబృందం.. - భోళా శంకర్ చిరంజీవి సాంగ్స్
Bhola Shankar Ticket Price Issue: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా టికెట్ రేటు పెంచుకునేందుకు చిత్రబృందం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, మరిన్ని వివరాలు అందజేయాలని ప్రభుత్వ వర్గాలు చిత్ర బృందాన్ని కోరాయి. దరఖాస్తుతో పాటు జత చేయాల్సిన డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంతో తదుపరి వివరాలు కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వంద కోట్ల రూపాయల బడ్జెట్ మార్గదర్శకాల మేరకు అదనపు వివరాలు కావాలని కోరినట్లు తెలుస్తోంది. ఇటీవలే వాల్తేరు వీరయ్య చిత్ర 200 రోజుల వేడుకలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ తరుణంలో ఆయన నటించిన భోళాశంకర్ సినిమా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వ అనుమతి లభించకపోవడం చర్చనీయాంశమైంది.
Chiranjeevi Comments on Government: ఇటీవల చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే.. దానికి సంబంధించిన పూర్తి వీడియో తాజాగా విడుదలైంది. "పిచ్చుకపై బ్రహ్మాస్త్రం" అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే ఏపీలోని రాజకీయ వర్గాల్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అసలు చిరంజీవి ఏమన్నారంటే.. 'సినిమా వాళ్ల రెమ్యూనరేషన్ గురించి పార్లమెంటులో మాట్లాడుతున్నారు.. రెమ్యూనరేషన్ తీసుకోవడం తప్పు అన్నట్లుగా ఎత్తి చూపొద్దన్నారు.. రెమ్యూనరేషన్ అంశం రాజ్యసభ వరకు తీసుకెళ్లొద్దని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.. వ్యాపారం జరుగుతోంది కాబట్టే సినిమాలు చేస్తున్నామని, వ్యాపారం జరుగుతోంది గనకే సినిమా తమకు ఇస్తున్నారన్నారు.. సినిమాలు చేస్తున్నాం కాబట్టే తమకు డబ్బులు, పలువురికి ఉపాధి లభిస్తోంది' అని ఆయన అన్నారు.