ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Gold jewelry thieves arrested

ETV Bharat / videos

తెలివిగా బంగారం అయితే కాజేశారు కాని.. ఆ తర్వాతే సీన్​ రివర్స్​! - Crime news

By

Published : Apr 1, 2023, 10:37 AM IST

బంగారు ఆభరణాల దుకాణంలో చోరీ కేసులో నిందితులను బాపట్ల జిల్లా చీరాల ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.. చీరాల పట్టణంలోని ఒక బంగారు ఆభరణాల దుకాణంలో చోరీ చేసిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు జిలా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. నిందితుల నుండి 4 లక్షలు విలువైన 80 గ్రాముల బంగారు గొలుసులు.. మరో దుకాణంలో అపహరించిన 25 వేలు విలువ చేసే వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర, పూణే నగరానికి చెందిన శేఖర్ హేమరాజ్ వాని, జోత్స్న, సూరజ్ కచ్, అనీల్ దీపక్ జాదవ్, పూజాశ్రావణ్ పరమర్, రక్షరాజు బగడే అనే నిందితులు మార్చి నెల 28 వతేదీ జువెలరీ దుకాణానికి వచ్చి.. బంగారు గొలుసులు చూపించమని అడిగారు. చూపించే క్రమంలో యజమాని దృష్టి మరల్చి చేతిలోని రుమాలు వేసి ఏడు చైన్లు గుత్తిగా ఉన్న దానిని దొంగలించి వెళ్లిపోయారు.. బంగారు గొలుసులు చోరీకి గురైన విషయాన్ని యజమాని గుర్తించి చీరాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఒకటో పట్టణం సీఐ మల్లికార్జునరావు దర్యాప్తు ప్రారంభించారు.. దుకాణంలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన వీడియో ఫుటేజ్​ని పరిశీలించి చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితులు హైదరాబాదులో ఉన్నట్లు తెలుసుకున్న సీఐ సిబ్బందితో వెళ్లి అరెస్ట్ చేశారు. 

నిందితులు గతంలో తెలంగాణలోని హనుమకొండలో  కళ్యాణ్ జువెలరీస్​లో కూడా ఓ బంగారు గొలుసు దొంగిలించి పూణేలో విక్రయించినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.. బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితులను సత్వరమే పట్టుకొని ఆభరణాలు రికవరీ చేసినందుకు సీఐ మల్లికార్జున రావును, ఎస్ఐ భాస్కరరావును సిబ్బందిని బాపట్ల జిల్లా ఎస్పీ రకుల్ జిందాల్ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details