ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Atchannaidu_Comments_on_Pension_Increment

ETV Bharat / videos

పింఛనులో సీఎం జగన్‌ మార్క్ వంచన-నాలుగున్నర ఏళ్లలో 750 రూపాయలు మాత్రమే పెంచారు: అచ్చెన్నాయుడు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 10:04 AM IST

Atchannaidu Comments on Pension Increment :పింఛనులో సీఎం జగన్‌ మోహన్ రెడ్డి మార్క్ వంచన చేశాడని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. 3వేల రూపాయల పింఛనుపై నాలుగున్నర సంవత్సరాలుగా జగన్‌ మడత పేచీ పెట్టారని అన్నారు. ఎన్నికల ముందు 3వేల రూపాయలు పింఛను ఇస్తానని హామీ ఇచ్చిన జగన్‌, అధికారం వచ్చాక ఏటా 250 రూపాయలు చొప్పున పెంపు అంటూ మాట తప్పారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pension Increment Not Implemented in YSRCP Government :జగన్ పెన్షన్‌ పెంపు పేరుతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు జగన్‌ దగా చేశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మాట ప్రకారం 2022 నాటికే 3వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని, ఎన్నికలకు మరో మూడు నెలల ముందు 3వేల రూపాయల పేరుతో మోసానికి దిగడాని ఆక్షేపించారు. 3 వేల హామీపై మడమ తిప్పి దాదాపు రూ.32 వేల వరకు ఎగనామం పెట్టాడని మండిపడ్డారు. 200 ఉన్న పెన్షన్‌ను 2వేల రూపాయలు చేసి ఐదేళ్లలో 1800 రూపాయలు పెంచామని, అలాగే 20 లక్షల కొత్త పింఛన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశానిదేనని గుర్తుచేశారు. జగన్‌ ఐదు ఏళ్లలో పెంచిన పింఛను కేవలం 750రూపాయలు మాత్రమేనని అచ్చెన్నాయుడు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details